Pages

చేతకాని వెవస్త లో చేతకాని మంత్రులు

 చేతకాని వెవస్త లో చేతకాని మంత్రులు, వీళ్ళు పదవిలో ఉంటె ఎంత లేకపోతె ఎంత. భరించాము ఇంకనైన హింసించక మనస్సంతిగా బ్రతకనివ్వండి బాబు..! మీరు రాజీనామా చేస్తారేమో అని చూసాం. ఇంకా మాకు ఓపిక నసించినదనె చెప్పలి.  మీ డైలాగ్లు విని విని విసిగిపోయం.మా ప్రాంతము అభివృధి కాలేదుమా ప్రాంతము అభివృధి కాలేదు అని ఇప్పుడు చెప్తున్నా నాయకులు ఇంత కాలం మంత్రి పదవల్లొ ఉండి  ఏమి చేసారో అర్థం కావటం లేదు. నిన్న తెలంగాణా రాజీనామాలు చేసో, ఉద్యమాలు చేసో ఎలాగో ఒకలా సెపరేటు తెలంగాణా సాధించుకున్నరు. విదిపోయిందేదో విడిపోయింది ఇకనైనా కలిసిఉందాం అనే మాట అనకుండా మన రాయలసీమకు చెందిన  నాయకులు,మంత్రులు ప్రస్తుత పరిస్తితులను మరింత జటిలం చేస్తున్నారు. ఈరోజు టిజి  వెంకటేష్ మీడియా తో మాటలాడడం  చూస్తూ ఉంటె తమ పబ్బం గడుపుకోడానికి ఉత్తుత్తి ఉద్యమాలు పేరుతో సీమని అభివృధి పదం నుంచి మరొక అడుగు వెనక్కి తీసుకువెళ్లే ప్రయత్నం సిగ్గులేకుండా కానిచెటట్టు మాటలడుతున్నారు. ఇంతకాలం మనం మనం వీళ్లకేన ఓట్లు వేసి గెలిపించినది అని సిగ్గు తో సగటు ఓటరుగ తల దిన్చుకోవాల్సి వస్తుంది. ఐన మన కర్మ కాకపొతే ఇంత చేతకాని వెదవలు మనకి నాయకులుగ ఉన్నారా?? హైకమాండ్ దగ్గర తమ సత్తా చుపించాలేకపోయరుకాని, ప్రతిప్రక్షాలను మాత్రం సమైక్యంగా ఉందాం రండి అని ముష్టి అడుగుకుంటున్నారు. మళ్ళి మద్యలో కొత్త రాజధాని మెలిక పెట్టి ఊరికే పబ్బం గాడుపుకుంటూ వచ్చే ప్రయతనం చేస్తున్నారనే విషయం మాత్రం అందరికి అర్ధం అవుతుంది

సర్వసాధారణం


ఈమధ్య మనకి అలవాటైన న్యూస్ లో 'మళ్ళి పెట్రోల్ ధర  పెంపు' ఒకటి . ఎప్పటిలాగే కాంగ్రెస్ మార్క్ రాజికీయలు దేశం లో కొనసాగిస్తూనే ఉంది. ఈరోజునుంచి మల్లి పెట్రోల్ మేద లిటరే కి 70పైసలు, డీజిల్ మీద 50పైసలు పెరిగింది. కానీ సగటు మానవుడి జీతబత్యాలు లో మాత్రం మార్పు రావడం లెదు. ఐన ఇది మనకి అలవాటేగ, రాత్రి ఐతే అమ్మకి మెడ కట్టిస్తాను అనడం, పొద్దున్నే చెప్పులు వేసుకొని బయటకి వెళ్ళిపోవడం. నాయకులను నిలదియ్యనంతవరకు వాళ్ళ ఆటలు అలానే సాగుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. నిన్న తెలంగాణా అనే బాంబు చల్లబడకముందే ఇంకొక బాంబు పేల్చడం కాంగ్రెస్ మార్కు రాజికీయం తప్ప ఇంకేంటి..??మనసంగతి రేపు పెట్రోల్ బంక్ కి తెలుస్తుందిగాని దేశం లో  మిగత చోట్ల రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..



పోలవరం మళ్లీ మొదలైంది

రాష్ట్ర, అంతరాష్ట్ర వివాదాల మధ్య నలిగిపోతున్న పోలవరం ప్రాజెక్ట్ఖ జాతీయ హోద ఫై కదలిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభేజనకు అంగీకరిస్తూ మంగళవారం CWC చేసిన తీర్మానంలో  పోలవరానికి జాతీయ హోద ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉంది. దీనీతో 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యకి ఒక పరిష్కారం దొరికినట్లింది. 

తెలంగాణా వచ్చేసింది,

తెలంగాణా వచ్చేసింది, కాని అందరిలోనూ ఒక్కటే సందేహం.. ఇంతకీ ఆ క్రెడిట్ ఎవరికీ దక్కుతుందనే.. తెలంగాణా కోసం సమ్మెలు ఉద్యమాలు చేసిన తెరాస దా, లేక తెరాస కోరిక తీర్చిన కాంగ్రెస్ ద..? మొత్తానికి బారతదేశంలో 29వ రాష్ట్రం ఆవిభావవించింది. మనకి కావలసినది అభివృది, ఇకనైనా ఒకరిమీద ఒకరు ఏడవకుండా బ్రతుకుతారని ఆశిద్దాం.. అభివృది  పదంలో  పయనిద్దాం అని ఆశిద్దాం.  

డొక్కా కి డొక్కా పగిలిపోవాలి

డొక్కా కి డొక్కా  పగిలిపోవాలి. నిన్నటి  వరకు అందరూ నోరు మూసుకొని హై కమాండ్ ఏమి చెప్తే అది తల తోక ఆడించిన కాంగ్రెస్ మంత్రులు, ఈరోజు ఇంకొక అడుగు ముందుకువేసి తమ చేతకాని తనాన్నిమరొక సారి రుజువుచెసుకొన్నరు. తాడికొండ  MLA  Mr.డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇప్పుడు తెలంగాణా  మీద నిర్ణయం వెలువడిన సందర్బంగా కొత్తగా రాజీనామా చెయ్యవలసిన అవసరంలేదని, కేంద్రం లో తమ హక్కులకోసం   పోరాదుదాము అని పిలుపునిచ్చారు. అంటే దాని  అర్ధం ఇంతకాలం సదరు మంత్రులు ఏమి చెయ్యలేదనేగ దాని అర్దమ్..! అసలు మనకి సిగ్గు ఉండాలి ఇలాంటివాకి వోట్ వేసి గెలిపిచినందుకు...